మరో అరుదైన ఘనత సాధించిన ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్

- March 07, 2018 , by Maagulf
మరో అరుదైన ఘనత సాధించిన ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్

ఢిల్లీలోని GMR అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మరో అరుదైన ఘనత సాధించింది. 2017 సంవత్సరానికి గానూ ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్ట్ గా ఎంపికైంది. అత్యున్నతమైన ఎయిర్‌పోర్ట్‌ సర్వీస్‌ క్వాలిటీ అవార్డ్‌ కైవసం చేసుకుంది. 60 మిలియన్లకు పైగా  ప్రయాణికుల సామర్థ్యం విభాగంలో... GMR ఎయిర్‌పోర్టు ఈ అవార్డు దక్కించుకుంది. దీనిపై GMR యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. IGIA భాగస్వాములు,  ఉద్యోగులు చూపిన  పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిబద్ధత వల్లనే ఈ ఘనత సాధ్యమైందని... ఢిల్లీ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ CEO ప్రభాకర్‌ రావు  తెలిపారు. తమకు ఎంతగానో సహకరించిన కేంద్ర విభాగాలన్నింటికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 2016లో 40 మిలియన్ల విభాగంలో ఢిల్లీ ఎయిర్పోర్ట్... ASQ అవార్డుల్లో ద్వితీయ స్థానంలో నిలిచింది. గతంలో 2014, 2015 సంవత్సరాల్లో 25 నుంచి 40 మిలియన్‌ సామర్థ్యం విభాగాల్లోనూ ఈ ఎయిర్‌పోర్టు నెంబర్‌ వన్‌ స్థానం దక్కించుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com