భారత్ పర్యటనకు వచ్చిన ఫ్రెంచ్ అధ్యక్షుడు
- March 08, 2018
పారిస్: ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ భారత్‌లో అధికార పర్యటన నిమిత్తం గురువారం ఇక్కడికి చేరుకున్నారు. ఆదివారం నాడు న్యూఢిల్లీలో జరుగనున్న సౌర విద్యుత్ సదస్సుకు హాజరు కానున్న ఫ్రెంచ్ అధ్యక్షుడు మెక్రాన్, తరువాత ప్రధాని మోడీతో భేటీ అవుతారని ఫ్రెంచ్ అధ్యక్ష కార్యాలయం ఒక ప్రకటనలో వివరించింది. భార్య బ్రిగెట్టితో సహా భారత్ వచ్చిన మాక్రాన్ ఆదివారం నాడు ఆగ్రాలోని తాజ్ మహల్‌ను సతీసమేతంగా సందర్శించనున్నారు. సోమవారం నాడు ఆయన వారణాసి నగరాన్ని సందర్శించి అక్కడ గంగశుద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను పరిశీలిస్తారు. దీనితో పాటు తమ దేశానికి చెందిన ఎయిర్‌బస్ హెలీకాప్టర్లు, స్కార్పియన్ జలాంతర్గాముల వంటి వాటి విక్రయాలకు సంబంధించి ఆయన చర్చలు జరుపనున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









