మస్కట్‌లోని ప్రముఖ రోడ్డు మూసివేత

- March 08, 2018 , by Maagulf
మస్కట్‌లోని ప్రముఖ రోడ్డు మూసివేత

మస్కట్‌: మునిసిపల్‌ అథారిటీస్‌, క్యాపిటల్‌లోని ప్రధాన రహదారిని ఈ వారాంతంలో మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఖుర్రమ్‌ బ్రిడ్జి మూసివేత నేపథ్యంలో అటువైపుగా వెళ్ళే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. గురువారం రాత్రి నుంచి మార్చి 11 ఆదివారం వరకు ఈ మూసివేత అమల్లో ఉంటుంది. అలాగే, ఆదివారం మరియు సోమవారం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రోడ్డుని మూసివేయనున్నారు. ట్రాఫిక్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ని వాహనదారులు పాటించాలనీ, మెయిన్‌టెనెన్స్‌ పనుల నిమిత్తమే ఈ మూసివేత నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మస్కట్‌ మునిసిపాలిటీ వర్గాలు వెల్లడించాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com