బహ్రెయిన్ లో మినీ ఒలింపిక్స్ ప్రారంభం
- March 08, 2018
మనామా: 5వ మినీ ఒలింపిక్స్ అధికారికంగా ప్రారంభమయ్యాయి. అత్యద్భుతమైన ఓపెనింగ్ సెర్మానీ ద్వారా ఈ వేడుకల్ని ప్రారంభించారు. ఇసా స్పోర్ట్స్ సిటీ - బహ్రెయిన్ వాలీబాల్ అసోసియేషన్ జిమ్ - రిఫ్ఫాలో ఈ వేడుకలు జరిగాయి. బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ (బిఓసి), మినిస్ట్రీఆఫ్ ఎడ్యుకేషన్‌తో కలిసి నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌కి చెందిన 3,500 మంది విద్యార్థులు, 20 స్పోర్ట్స్‌లో తలపడనున్నారు. బహ్రెయిన్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్, సుప్రీం కౌన్సిల్ ఫర్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఛైర్మన్, ఛారిటీ వర్క్స్ మరియు యూత్ ఎఫైర్స్‌కి సంబంధించి కింగ్ హమాద్ ప్రతినిథి అయిన షేక్ నాజర్ బిన్ హమాద్ అల్ ఖలీఫా ఈ పోటీల్ని ప్రారంభించారు. మార్చి 22 వరకు ఈ మినీ ఒలింపిక్ పోటీలు జరుగుతాయి. స్పోర్ట్స్ రంగానికి చెందిన పలువురు ముఖ్య అధికారులు, ఇతర ప్రముఖులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







