నకిలీ వార్తలు: మస్కట్ లో హత్య జరిగిందనే పుకార్లను ఖండించిన పోలీసులు

- March 08, 2018 , by Maagulf
నకిలీ వార్తలు: మస్కట్ లో హత్య జరిగిందనే పుకార్లను ఖండించిన పోలీసులు

మస్కట్: ' ఇదిగో తోక అంటే.... అదిగో పులి ' అంటూ కొందరు సామాజిక మాధ్యమాలలో విపరీతమైన అసత్య ప్రచారం చేస్తున్నారు. దీంతో తమపై పెరుగుతున్న వత్తిడికి రాయల్ ఒమన్ పోలీసులు బెంబేలు చెందుతున్నారు. సుల్తాన్ రాజధానిలో ఒక ఒమాని పౌరుడు హత్య చేయబడ్డాడని అసత్య ప్రచారాన్ని తిరస్కరించింది. "మస్కట్ గవర్నరేట్ లో  పౌరుడిపై హత్యాయత్న ఘటన గురించి సోషల్ మీడియాలో పంపిణి కావడం ఎంత్క్త్ మాత్రం నిజం కాదని రాయల్ ఒమాన్ పోలీసులు మొత్తుకొంటున్నారు. మామూలుగా చనిపోయిన ఓ వ్యక్తి మరణం సహజమైనదని ఆ ఘటనలో ఎటువంటి నేరపూరిత కోణం లేదని పౌరులు పుకార్లను నమ్మవద్దని పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com