విడుదలకు సిద్ధమైన 'తొలికిరణం' సినిమా

- March 08, 2018 , by Maagulf
విడుదలకు సిద్ధమైన 'తొలికిరణం' సినిమా

కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ రూపకల్పనలో జరుగుతున్న ఆలస్యమే చిత్ర విడుదలలో జాప్యం జరిగేందుకు కారణమని చెబుతున్నారు తొలి కిరణం చిత్రయూనిట్‌ సభ్యులు. సువర్ణ క్రియేషన్స్‌ పతాకంపై జాన్‌బాబు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. భానుచందర్‌ కీలక పాత్రలో నటించగా.పీడీ రాజు ఏసుక్రీస్తు పాత్రను పోషించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తొలి కిరణం సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భగా నటుడు భానుచందర్‌ మాట్లాడుతూ.ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా చాలా చిత్రాలు వచ్చాయి. ఆ చిత్రాలన్నీ ఏసుక్రీస్తు జన్మించినప్పటి నుంచి శిలువ వేసే వరకు సాగుతాయి. ఆయన మరణించిన మూడు రోజుల తర్వాత సమాధి లోనుంచి లేచి వచ్చి శాంతి సందేశాన్నిస్తూ భూమిపై తిరిగారు. ఆ కథను తొలి కిరణం సినిమాలో దర్శకులు జాన్‌బాబు చూపిస్తున్నారు. సినిమా రషెస్‌ చూశాను చాలా చక్కగా సినిమాను రూపొందించారు. మా అబ్బాయి హీరోగా నా కొడుకు బంగారం అనే చిత్రాన్ని జాన్‌బాబు గారి దర్శకత్వంలోనే చేయబోతున్నాం. అన్నారు. దర్శకుడు జాన్‌బాబు మాట్లాడుతూ.లండన్‌లో గ్రాఫిక్స్‌ పనులు జరగడంలో ఆలస్యమైంది. అందుకే చిత్రాన్ని కొద్ది జాప్యంతో విడుదల చేస్తున్నాం. అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com