అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ ప్రాంతంలోనే ' ఉత్తమ విమానాశ్రయం
- March 10, 2018
అబూదాబి : వరుసగా రెండవ ఏడాది సైతం అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఈ ప్రాంతంలో ' ఉత్తమ విమానాశ్రయం ' గా ఎంపికయ్యిందని ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్,(ఏ సి ఐ) ఇటీవల ప్రకటించింది. ఏ యు హెచ్ వార్షిక ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ, (ఏ ఎస్ క్యూ) లో, 'మధ్య ప్రాచ్యం ' ( మిడిల్ ఈస్ట్ ) లో ఉత్తమ విమానాశ్రయం' గా పలు అంశాలలో పురస్కారాలు అందుకొని విజేతగా నిలిచింది. ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అనేది ఒక ప్రయాణపు రోజున విమానాశ్రయంలో పలువురు ప్రయాణీకులను సర్వే చేసే ఏకైక ప్రపంచవ్యాప్త కార్యక్రమం. కార్యక్రమం 34 ముఖ్యమైన పనితీరు సూచికలను గూర్చి నేరుగా ప్రయాణీకులను అడిగి తెల్సుకొంటుంది. వాటిని పరిగణనలోనికి తీసుకొంటుంది. వీక్షణలు కొలుస్తుంది. ప్రపంచంలోని ప్రముఖ 100 అత్యంత రద్దీ గల విమానాశ్రయాలలో డెబ్భై నాలుగు శాతం ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ నెట్వర్క్ లో భాగంగా ఉన్నాయి, ఈ సర్వే 84 దేశాలలో 42 భాషలలో సంవత్సరానికి 6 లక్షల మంది వ్యక్తిగత సర్వేలను అందిస్తుంది. ఈ కార్యక్రమం 2017 లో 343 విమానాశ్రయాలలో తన సేవలు అందించింది, ఇక్కడ నుంచి ప్రపంచంలోని 7.1 బిలియన్ల మంది ప్రయాణికులలో సగం మంది అబుదాబి ఇంటర్నేషనల్ లో ప్రవేశించారు. అబుదాబి విమానాశ్రయాల యాక్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్ మజీద్ అల్ ఖురి ఈ సందర్భంగా మాట్లాడుతూ , "అటువంటి ఉన్నతమైన గౌరవ స్థాయికి మేము వరుసగా రెండవ సారి చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మేము అందించే పలు సేవలను గూర్చి మా ప్రయాణీకులు ఏమనుకొంటున్నారో మాకు తెలియచేసే విషయంలో పారదర్శక ప్రతిబింబంగా ఉన్నందున మేము ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ, (ఏ ఎస్ క్యూ) ప్రకటించే ప్రశంసల అవార్డులు మా పనితీరు, విజయానికి కీలకమైన సూచికగా పరిగణించాము.మా బృందం, మా వాటాదారులు, విమానాశ్రయంలో పనిచేస్తున్న సంస్థలన్నీ తెలుసు, వారు తమ విధులలో రేయంబగళ్లు ఎదుర్కొన్నసవాళ్లు నాకు తెలుసు, వారు తమ అంచనాలను ఏనాడు విఫలమవలేదు. యూఏఈ రాజధానికి ప్రపంచ స్థాయి ద్వారం గుండా నిత్యం ఎందరో ప్రయాణికులను పంపిస్తున్నారు." ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ ప్రకటన ప్రకారం, ఈ సంవత్సరం అవార్డు మొదటిసారి గుర్తింపు పొందిన16 విమానాశ్రయాలను మొదటిసారి గుర్తించింది. సమయం, పెరుగుతున్న పోటీతత్వ విమానాశ్రయ పరిశ్రమ పర్యావరణాన్ని ప్రతిబింబిస్తుంది. అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా గుర్తింపు పొందింది మరియు ప్రపంచవ్యాప్తంగా 57 వ స్థానంలో నిలిచింది. ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ అవార్డుల వేడుక సెప్టెంబర్ 10 - 13 సెప్టెంబర్ మధ్య .కెనడాలోని హాలిఫాక్స్లో ఏ సి ఐ కస్టమర్ ఎక్సలెన్స్ సమ్మిట్ లో జరగనుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి