జాతీయ అవార్డు దక్కించుకున్న విజయవాడ ఎయిర్‌పోర్టు

- March 10, 2018 , by Maagulf
జాతీయ అవార్డు దక్కించుకున్న విజయవాడ ఎయిర్‌పోర్టు

విజయవాడ: జాతీయ స్థాయిలో సత్తాచాటి తన ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పింది.. అమరావతి రాజధానికి తలమానికమైన విజయవాడ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు జాతీయస్థాయిలో బెస్ట్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టు అవార్డును సాధించటం గొప్ప మైలురాయి. అనతికాలంలో.. శరవేగంగా భారీ నిర్మాణరంగం, మౌలిక సదుపాయాలతో విస్తరిస్తున్న వాటిలో విజయవాడ ఎయిర్‌పోర్టు ప్రథమ స్థానంలో నిలిచింది. పాత టెర్మినల్‌ ఆధునికీకరణ, రూ.148 కోట్లతో ఇంటీరియం టెర్మినల్‌ విస్తరణ, రూ.168 కోట్లతో రన్‌వే విస్తరణ పనులు, రూ.700 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ నిర్మాణానికి శ్రీకారం, రూ.5 కోట్లతో అంతర్జాతీయ విమానాల టెర్మినల్‌ ఆధునీకరణలతో పాటు కోట్లాది రూపాయలతో అదనపు పార్కింగ్‌ బేలు, కార్‌ పార్కింగ్‌ ఏరియాలు, అంతర్గత రోడ్లు, లైటింగ్‌, గ్రీనరీ, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులు వంటివి విమానాశ్రయంలో జరుగుతున్నాయి. అధునాతన ఫైర్‌ఫైటింగ్‌ తదితర వ్యవస్థల అభివృద్ధి జరుగుతూనే ఉన్నాయి. పాత టెర్మినల్‌ను అంతర్జాతీయ టెర్మినల్‌గా ఉపయోగించుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో, కస్టమ్స్‌, ఇమిగ్రేషన్‌ వంటి విభాగాలకు కూడా ఇందులో ప్రత్యేక కార్యాలయాలను నిర్మించారు. నిర్మాణరంగ ప్రాజెక్టుల్లో దేశంలోనే సత్తా చాటిన విజయవాడ ఎయిర్‌పోర్టుకు ప్రధానంగా ఇటీవల నిర్మించిన ఇంటీరియం టెర్మినల్‌ బిల్డింగ్‌, సెర్మోనియల్‌ లాంజ్‌లు మంచి మార్కులను తెచ్చిపెట్టాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com