భారత్-ఫ్రాన్స్ మధ్య 14 కీలక ఒప్పందాలు
- March 10, 2018
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్ 4 రోజుల భారత పర్యటనలో భాగంగా భారత్-ఫ్రాన్స్ మధ్య 14 కీలక ఒప్పందాలు జరిగాయి. ద్వైపాక్షిక చర్చల అనంతరం సీఈఓల ఫోరంకు హాజరైన ప్రధాని మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు సమక్షంలో 14 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం భారత రాజ్యాంగంలో వేళ్లూనుకున్నాయని ఈ సందర్భంగా మోడీ వ్యాఖ్యానించారు.
హిందూ మహాసముద్రంలో విస్తృత సహకారానికి ఇరు దేశాధినేతలు తమ విజన్ ప్రకటించారు. మైగ్రెంట్ మొబిలిటీ, పార్టనర్‌షిప్‌ను పటిష్టపరిచేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోడీ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ రక్షణ సహకారంలో నూతన చరిత్రను ఆవిష్కరించే ఒప్పందం కుదరడంపై హర్షం వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టాలని మోడీ ఫ్రాన్స్‌ను ఆహ్వానించారు.
భారత్ - ఫ్రాన్స్ మధ్య రక్షణ సహకారానికి కీలక ప్రాధాన్యం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు తెలిపారు. ఉగ్రవాదంపై రెండు దేశాలు పోరాడాలాని నిర్ణయించినట్టు చెప్పారు. తర్వాత ఎమ్మాన్యుయెల్ మేక్రాన్ రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో ఆయన విద్యార్థులతో ముచ్చటించారు. భారత్- ఫ్రాన్స్ దేశాల ప్రజలు, విద్యార్థుల రాకపోకలు రెండు దేశాల్లో మరింత పెరగాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







