భరత్ అనే నేను ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

- March 11, 2018 , by Maagulf
భరత్ అనే నేను ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న భరత్ అనే నేను ఏప్రిల్ 20న విడుదల కాబోతుంది. టీజర్ తో సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమాకి ఆడియో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేశారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న భరత్ అనే నేను ఆడియోని అభిమానుల మధ్య గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. 
భరత్ అనే నేను...ప్రజెంట్ టాలీవుడ్లో క్రేజ్ ఉన్న మూవీ ఇది. మహేష్-కొరటాల శివ కాంబినేషన్లో డివివి దానయ్య నిర్మిస్తున్న మూవీ ఇది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ అంచనాలున్న భరత్ అనే నేను మూవీ పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతుంది. కొరటాల శివ దర్శకుడు కావడంతో సినిమాపై ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ ఏర్పడింది.

భరత్ అనే నేను మూవీలో మహేష్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజరే సినిమాపై మరింత హైప్ తెచ్చిపెట్టింది. మహేష్ బాబు ఈ మూవీలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. అందుకే ఈ సినిమాపై ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ ఏర్పడింది.

ఏప్రిల్ 20న భరత్ అనే నేను మూవీ విడుదలవుతోంది. ఏప్రిల్ 7న ఆడియో సాంగ్స్ ని రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. అయితే వెన్యు ఎక్కడనేది మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదట. హైప్ ఉన్న కారణంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 150 కోట్లు వరకు చేసింది. మరి ఈ సినిమాతో మహేష్ బాబు ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com