తమిళనాడు:మంటల్లో చిక్కుకున్న 60 మంది విద్యార్థులు
- March 11, 2018
చెన్నై : తమిళనాడులోని తేని జిల్లా బోడి సమీపంలోని కురంగణి అడవుల్లో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో దాదాపు 60 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక యువతి చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. ఈరోడు, కోయంబత్తూరు నుంచి కళాశాల విజ్ఞాన యాత్ర కోసం విద్యార్థులు అడవుల్లోకి వెళ్లారు.
ఆ సమయంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విద్యార్థులు మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అధికారులు వారిని రక్షించేందుకు యత్నిస్తున్నారు. బలమైన గాలులు వీస్తుండటంతో మంటలు చెలరేగుతున్నాయి. దీంతో విద్యార్థులను రక్షించే ప్రయత్నానికి అంతరాయం కలుగుతోంది. సుమారు కిలోమీటర్ మేర మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి కలెక్టర్, ఎస్పీ, పోలీసులు చేరుకున్నారు. విద్యార్థులతో సమాచార సంబంధాలు కట్ అవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







