కార్మిక చట్టం ఉల్లంఘించినందుకు 247 మంది ప్రవాసీయులు అరెస్ట్
- March 11, 2018
మస్కట్ : కార్మిక చట్టం ఉల్లంఘించిన నేరానికి 247 మంది ఆసియా మరియు ఆఫ్రికన్ జాతీయులను రాయల్ ఒమాన్ పోలీసులు ఇతర ప్రభుత్వ సంస్థలతో సహకారంతో అరెస్ట్ చేశారు. వీరిలో 199 మంది మహిళలు, 48 మంది పురుషులు ఉన్నారు. మస్కాట్ లో విచారణ, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం స్పెషల్ టాస్క్ ఫోర్స్, మానవ వనురుల శాఖ , బాషేర్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ సహకారంతో వారిని అదుపులోనికి తీసుకొన్నారు. " ఈ సందర్భంగా రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు " మా గల్ఫ్ న్యూస్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, వారు బాషేర్ లోని వివిధ ప్రదేశాల నుండి అరెస్టు చేయబడ్డారని తెలిపారు. వీరిలో అత్యధికులు చేసిన నేరాలు ఏమిటంటే చట్టవిరుద్ధంగా దేశంలో ప్రవేశించడం, కార్మిక మరియు నివాస చట్టాల ఉల్లంఘన, మోసం, వ్యభిచారం మరియు మానవ అక్రమ రవాణా వంటివిఉన్నాయి. వీరి నేరాలపై దర్యాప్తు పూర్తిచేయడానికి నిందితులను న్యాయ అధికారుల ఎదుటకు సూచించబడ్డారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







