లండన్ కు చేరిన కట్టప్ప ఖ్యాతి

- March 11, 2018 , by Maagulf
లండన్ కు చేరిన కట్టప్ప ఖ్యాతి

బాహుబలి సిరీస్‌లో కట్టప్ప పాత్రకు దక్కిన గుర్తింపు అంతా ఇంతా కాదు. మాషిష్మతి రాజ్యానికి, సింహాసనానికి.. నమ్మిన బంటుగా ఉండే పాత్రలో నటుడు సత్యరాజ్‌ మెప్పించగా.. దర్శకధీరుడు రాజమౌళి ఆ పాత్రను అద్భుతంగా తీర్చి దిద్దడంతో జనాలు బాగా కనెక్ట్‌ అయ్యారు. అయితే ఆ కట్టప్ప అలియాస్‌ సత్యరాజ్‌కు ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది.

లండన్‌లోని మేడమ్‌ టుస్సాడ్‌ మ్యూజియంలో కట్టప్ప మైనం విగ్రహం ఏర్పాటు చేయబోతున్నారు. త్వరలో కట్టప్ప రూపంలో ఉన్న సత్యరాజ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు మ్యూజియం నిర్వాహకులు ప్రకటించారు. ఈ విషయాన్ని కోలీవుడ్‌ మీడియా, సత్యరాజ్‌ తనయుడు శిబి సత్యారాజ్‌ కూడా ధృవీకరించారు. 

ఇక్కడ మరో విశేషం ఏంటంటే... మేడమ్‌ టుస్సాడ్‌లో విగ్రహ ఏర్పాటు గౌరవం అందుకున్న తొలి తమిళ నటుడు సత్యరాజ్‌ కావటం. అంతకు ముందు బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్‌ విగ్రహాన్ని కూడా బ్యాంకాక్ మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో నెలకొల్పిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com