ముంబైలో హైటెన్షన్..!
- March 12, 2018
ముంబైలో హైటెన్షన్ మొదలయ్యింది. రైతు సమస్యలను పరిష్కరించాలంటూ ఆరు రోజుల పాటు 180 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ముంబై చేరుకున్న అన్నదాతలు.. మరికాసేపట్లో మహారాష్ట్ర అసెంబ్లీని ముట్టడించనున్నారు. ఆజాద్ మైదానంలో దాదాపు 50 వేల మంది రైతులు నేతల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. పరీక్షలు జరుగుతుండడంతో.. ఉదయం 11 గంటల తర్వాత మైదానం నుంచి కదులుతామంటూ ఇప్పటికే ప్రకటించారు రైతు సంఘం నేతలు. అటు.. చర్చలతో సమస్యను పరిష్కరించుకుందామంటూ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. రైతు సంఘం నేతలను చర్చల కోసం విధాన్ భవన్కు ఆహ్వానించారు.
విదర్భ నుంచి రైతుల యాత్ర మొదలైనప్పటి నుంచీ ఎలాంటి నిర్భంధాలు విధించని మహారాష్ట్ర ప్రభుత్వం, ఆజాద్ మైదానం నుంచి మాత్రం వారిని బయటకు రానివ్వకూడదని భావిస్తోంది. అసెంబ్లీను చుట్టుముడితే, శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని ఆందోళన చెందుతున్నారు పోలీసులు. అయితే, ఈ ఆందోళనకు నేతృత్వం వహిస్తున్న అఖిల భారత కిసాన్ సభ మాత్రం, ముంబై వాసులకు ఎలాంటి ఇబ్బంది రానివ్వమని చెబుతోంది. అందరికీ అన్నం పెట్టే రైతు సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఆందోళనలకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరింది. ముఖ్యమంత్రితో చర్చలు విఫలమైతే గనక, అసెంబ్లీ ముట్టడికి రైతులు వెళ్లే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







