ఇంజన్ లో సమస్య ఇండిగో విమానాలకు బ్రేక్‌

- March 12, 2018 , by Maagulf
ఇంజన్ లో సమస్య ఇండిగో విమానాలకు బ్రేక్‌

ఇండిగోకి చెందిన ఎయిర్‌బస్‌-నియో విమానం ఇంజన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది కలవరపాటుకు గురయ్యారు. ఈ సంఘటన సోమవారం ఉదయం అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో జరిగింది. 

ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఎయిర్‌పోర్టు అధికారులు తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కొనుగోలు చేసిన ఎయిర్‌బస్‌ ఎ-320 నియో విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని గుర్తించడంతో ఎయిర్‌లైన్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్‌కు సిద్ధంగా ఉన్న మరో మూడు విమానాలను నిలిపివేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com