ప్రాస్టిట్యూషన్, ట్రాఫికింగ్ కేసుల్లో 240 వలసదారుల అరెస్ట్
- March 12, 2018
మస్కట్: మొత్తం 199 మంది మహిళలు, 48 మంది పురుషుల్ని వ్యభిచారం, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. బౌషర్‌లోని పలు ప్రాంతాల్లో వీరిని అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించడం జరిగింది. బౌషర్‌లో 247 మందిని ఉల్లంఘనలకు పాల్పడుతున్న నేరంలో అరెస్ట్ చేశామనీ, అందులో 199 మంది మహిళలు కాగా, 48 మంది పురుషులనీ, వీరంతా ఆసియా మరియు ఆఫ్రికాకి చెందిన జాతీయులనీ పోలీసులు వెల్లడించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - మస్కట్, క్రైమ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్, బౌషర్ పోలీస్ స్టేషన్ మరియు స్పెసల్ ఫోర్సెస్ పోలీస్ కమాండ్ - మినిస్ట్రీ ఆఫ్ మేన్ పవర్, బౌషర్ మునిసిపాలిటీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. అక్రమ చొరబాట్లు, రెసిడెన్స్ చట్టాన్ని ఉల్లంఘించడం, ఫ్రాడ్ తదితర కేసుల్లోనూ వీరిని నిందితులుగా గుర్తించారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







