బర్త్ డే స్పెషల్..ఇంస్టాగ్రామ్ కు ఎంట్రీ ఇచ్చిన అమీర్ ఖాన్..
- March 13, 2018
విలక్షణ నటుడు అమీర్ ఖాన్ జన్మించి నేటికి 53 ఏళ్లు. ఈ సందర్భంగా అభిమానులకు మరింత చేరువ కావాలని అమీర్ భావించాడు. ఇన్ స్టాగ్రామ్‌లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్‌లో ఉంటున్న అమీర్ మరొక సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ అయిన ఇన్ స్టాగ్రామ్ ద్వారా కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవాలని భావిస్తున్నాడు.
ఇప్పటికే సోషల్ మీడియాలో 37 మిలియన్ యూజర్లను కలిగి ఉన్న అమీర్ ఖాన్ . ఫొటో షేరింగ్ ఫ్లాట్ పామ్ ద్వారా ఎప్పటి కప్పుడు తన గురించి అప్డేట్స్ అందించేందుకు నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ అనే చిత్రం షూటింగ్లో అమీర్ ఖాన్ పాల్గొంటున్నాడు. జోధ్‌పూర్ లో ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
1965 మార్చి 14న జన్మించిన అమీర్ ఖాన్ బాల నటుడిగా 1973లో యాదోంకీ బారాత్ చిత్రంలో నటించాడు. ఆ తర్వాత 1984లో హోలీ అనే ఓ చిత్రంలో నటించాడు. 1988 నుంచి పూర్తిస్థాయి నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ఇన్నేళ్ల సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాడు. తన విలక్షణ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే నైపుణ్యాన్ని సంపాదించుకున్నాడు. కోట్లాది ప్రజల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. భారతదేశంతో పాటు చైనా, పాకిస్థాన్ దేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పొందాడు.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







