'నరేంద్ర ఝా' ఇక లేరు
- March 13, 2018
ముంబై: బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా (55) కన్నుమూశారు. బుధవారం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు. బాలీవుడ్ స్టార్హీరోలతో పలు కీలక ప్రాత్రల్లో నటించిన నరేంద్ర మోడలింగ్‌తో కెరియర్ ప్రారంభించారు. టెలివిజన్ నటుడుగా కూడా ప్రఖ్యాతి గాంచారు. అలా 2002లో ఫంటూష్ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అనతరం హదర్, రాయీస్, మొహంజోదారో లాంటి ప్రఖ్యాత సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మూవీ ‘కాబిల్’లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. టాలీవుడ్లో యమదొంగ, లెజెండ్, ఛత్రపతి సినిమాల్లో నరేంద్ర ఝా నటించారు. కాగా సల్మాన్‌ఖాన్ హీరోగా బాలీవుడ్ అప్ కమింగ్ మూవీ రేస్-3 నరేంద్ర ఆఖరి చిత్రం.
ఇండస్ట్రీ నటీనటులు, దర్శకనిర్మాతలు సహా పలువురు పెద్దలు నరేంద్ర ఆకస్మిక మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!