'నరేంద్ర ఝా' ఇక లేరు

- March 13, 2018 , by Maagulf
'నరేంద్ర ఝా' ఇక లేరు

ముంబై: బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా  (55) కన్నుమూశారు.  బుధవారం తీవ్రమైన గుండెపోటు రావడంతో ఆయన  తుది శ్వాస విడిచారు.  బాలీవుడ్‌ స్టార్‌హీరోలతో  పలు కీలక ప్రాత్రల్లో  నటించిన  నరేంద్ర మోడలింగ్‌తో కెరియర్‌ ప్రారంభించారు.  టెలివిజన్‌ నటుడుగా కూడా ప్రఖ్యాతి గాంచారు.  అలా 2002లో  ఫంటూష్‌  సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.   అనతరం హదర్‌, రాయీస్‌, మొహంజోదారో లాంటి ప్రఖ్యాత సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్‌  రోషన్‌ మూవీ ‘కాబిల్‌’లో  పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. టాలీవుడ్‌లో యమదొంగ, లెజెండ్‌, ఛత్రపతి సినిమాల్లో నరేంద్ర ఝా నటించారు. కాగా సల్మాన్‌ఖాన్‌  హీరోగా బాలీవుడ్‌ అప్‌ కమింగ్‌  మూవీ  రేస్‌-3  నరేంద్ర ఆఖరి చిత్రం.

 ఇండస్ట్రీ నటీనటులు, దర్శకనిర్మాతలు సహా పలువురు పెద్దలు నరేంద్ర ఆకస్మిక మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com