ఒమన్‌లో ఇండియన్‌ స్కూల్‌ ఫీజుల పెంపు

- March 14, 2018 , by Maagulf
ఒమన్‌లో ఇండియన్‌ స్కూల్‌ ఫీజుల పెంపు

మస్కట్‌: ఇండియన్‌ స్కూల్‌ మస్కట్‌ (ఐఎస్‌ఎం) ట్యూషన్‌ ఫీజుల్ని ఈ ఏడాది నుంచి పెంచుతున్నట్లు ప్రకటించింది. గల్ఫ్‌ రీజియన్‌లోనే అతి పెద్ద కో-ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌గా ఈ సంస్థ పేరు సంపాదించుకుంది. 9,200 మందికి పైగా స్టూడెంట్స్‌ ఈ విద్యా సంస్థలో ఉన్నారు. ఐఎస్‌ఎం స్కూల్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌ చౌహన్‌ మాట్లాడుతూ, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ ప్రపోజల్‌ని ఆమోదించారనీ, నెలకు 2 ఒమన్‌ రియాల్‌ ట్యూషన్‌ ఫీజుని 1 నుంచి 12 తరగతుల వరకు పెంచాలని ఆ ప్రపోజల్‌ పేర్కొందని తెలిపారు. ఫీజుల పెంపు ద్వారా సమకూరే అదనపు నిధులతో స్టాఫ్‌ జీతాల రీస్ట్రక్చరింగ్‌ కోసం వినియోగించనున్నట్లు ఐఎస్‌ఎం పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com