అజ్మాన్:54 ఏళ్ళ ప్రొఫెసర్ బాత్ టబ్‌లో మృతి
- March 14, 2018
అజ్మాన్:54 ఏళ్ళ ఉక్రెయిన్ ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్, తాను బసచేసిన హోటల్లోని బాత్‌టబ్‌లో విగతజీవిగా కన్పించారు. మృతుడ్ని ఖాకివ్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్కి చెందిన ప్రొఫెసర్‌గా గుర్తించారు. 'క్లైమేట్ చేంజ్ అండ్ సస్టెయినబులిటీ'పై జరుగుతున్న 5వ అజ్మన్ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంటల్ కాన్ఫరెన్స్‌లో హాజరయ్యేందుకు ఆయన వచ్చారు. తొలి రోజు సమావేశాల్లో పాల్గొని, ఆ తర్వాత హోటల్‌కి వెళ్ళిపోయారాయన. దురదృష్టవశాత్తూ హోటల్ రూమ్‌లోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. హోటల్ ఉద్యోగులు అతని మృతదేహాన్ని కనుగొన్నారు. పోలీస్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించింది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు పారామెడిక్స్ నిర్ధారించాయి. పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీర్ ఖాలిద్ అల్ హౌసాని మాట్లాడుతూ, డాక్టర్ సెర్జివ్, సైంటిఫిక్ కమిటీ ఆహ్వానం మేరకు వచ్చారనీ, పైగా సొంత ఖర్చులతో ఆయన వచ్చారనీ, ఇంత మంచి వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. అజ్మన్ మునిసిపాలిటీ, మృతదేహాన్ని స్వదేశానికి పంపించేందుకు తగు చర్యలు తీసుకుంది.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..