'తమిళ రాకర్స్' వెబ్సైటు అడ్మిన్ లు అరెస్ట్..!

- March 15, 2018 , by Maagulf
'తమిళ రాకర్స్'  వెబ్సైటు అడ్మిన్ లు అరెస్ట్..!

తమిళనాట నిర్మాతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న పైరసీ సైట్ తమిళ రాకర్స్ కు చెందిన అడ్మిన్ లను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.. తమిళనాట తమిళ రాకర్స్‌, తమిళ బాక్స్ అనే సంస్థలు సినిమా రిలీజైన రోజే పైరసీని మార్కెట్‌లోకి తీసుకొచ్చి నిర్మాతల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. పైరసీ భూతాన్ని అరికట్టేందుకు చిత్రపరిశ్రమ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా దశాబ్దంగా పైరసీ దారుల ఆగడాలకి అడ్డుకట్ట వేయలేకపోయారు.. ఎట్టకేలకు పోలీసులు రీసెంట్‌గా తమిళ రాకర్స్ అడ్మిన్ అయిన జాన్‌, కార్తీక్‌, ప్రభులని అరెస్ట్ చేశారు. విజుపురం, నెల్లై ప్రాంతాలలో ఈ ముగ్గురి నిందితులని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ ముగ్గురిపైన కేసు నమోదు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు.. కాగా తమిళ రాకర్స్ సైట్ కీలక సూత్రధారులు అరెస్ట్ కావడం పట్ల తమిళ నిర్మాతల మండలి కేరళ, చెన్నై పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది.. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com