ఢిల్లీలో నేటి నుండి కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు
- March 15, 2018
ఢిల్లీలో ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు కాంగ్రెస్ ప్లీనరీ జరగబోతోంది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక జరుగుతున్న తొలి సమావేశం కావడంతో.. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సారి సమావేశాల్లో ప్రధానంగా కార్యకర్తల సంక్షేమంపై చర్చిస్తూ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తొలి రోజు పార్టీ వ్యూహాలపై సీనియర్ల మేథోమధనం తర్వాత సాయంత్రం స్టీరింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. మొత్తం 4 తీర్మానాలను ఈ సమావేశాల్లో ఆమోదిస్తారు.
తాజా రాజకీయ పరిస్థితులపై ఒక తీర్మానంతో పాటు ఆర్థిక, విదేశీ వ్యవహారాలపై విడివిడిగా తీర్మానాలను పార్టీ ఆమోదించనుంది. వీటితోపాటు వ్యవసాయం, నిరుద్యోగం, పేదరిక నిర్మూలనపై కూడా తీర్మానాలు చేస్తారు. వివిధ అంశాల్లో కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రస్తావించడంతోపాటు, ప్రస్తుత స్థితిగతుల్ని లోతుగా విశ్లేషిస్తారు. ఇక రేపు రాహుల్ గాంధీ ప్రారంభోపన్యాసం చేస్తారు. ఆదివారం సాయంత్రం ఆయన ప్రసంగంతోనే ప్లీనరీ ముగుస్తుంది. పార్టీ వ్యూహాలను, ప్రాధమ్యాలను ఆయన ముగింపు సభలోనే వివరించనున్నారు.
రాజకీయ తీర్మానం సందర్భంగా జరిగే చర్చలో పొత్తులు, కూటముల గురించి ప్రధానంగా చర్చించబోతున్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనేందుకు భావసారూప్యత కల్గిన అన్ని పార్టీలను కలుపుకుని మహా కూటమిని ఏర్పాటు చేయాల్సిన అవసరంపైనా ప్లీనరీలో చర్చిస్తారు.
తాజా వార్తలు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్...
- ఎనిమిది బోర్డులకు డెవలప్మెంట్ అవార్డ్స్ ప్రకటించిన ICC
- హైమా నుండి నిజ్వాకు క్షతగాత్రుల ఎయిర్ లిఫ్ట్..!!
- డిపొర్టీస్ యూఏఈకి తిరిగి రావచ్చా? దరఖాస్తు ఎలా?
- శాశ్వతంగా కన్నుమూసిన ‘స్లీపింగ్ ప్రిన్స్’..!!
- ప్రపంచ వ్యాపార కేంద్రంగా సౌదీ అరేబియా..నైపుణ్య-ఆధారిత వర్క్ పర్మిట్..!!
- ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవనం.. "అతీన్ స్క్వేర్" ప్రారంభం..!!
- ఆకస్మిక తనిఖీలు.. 10 టన్నుల కుళ్లిన సీ ఫుడ్ సీజ్..!!
- తెలంగాణ సచివాలయంలో ఈ-పాస్ విధానం..
- హైదరాబాద్లో ఆగస్టు 10న 'రన్ ఫర్ SMA–2025'