ప్రముఖ బాంగ్రా పాప్ గాయకుడు దలేర్ మెహందీకు జైలు శిక్ష
- March 16, 2018
ప్రముఖ బాంగ్రా పాప్ గాయకుడు దలేర్ మెహందీని మనుషుల అక్రమ రవాణా కేసులో పాటియాలా కోర్టు దోషిగా తేల్చింది. తన మ్యూజికల్ ట్రూప్ విదేశాల్లో చేసే కార్యక్రమాల్లో భాగంగా అక్కడి వెళ్లే వారితో పాటు.. కొంత మందిని అక్రమంగా విదేశాలకు తీసుకెళ్లినట్టుగా 2003లో దలేర్ మెహందీ, అతని సోదరుడు షంషేర్ సింగ్‌లపై కేసు నమోదైంది. యూఎస్, యూకే, కెనడా లతో పాటు మరికొన్ని దేశాలకు దలేర్ మనుషులను తీసుకెళ్లినట్టుగా ఆరోపణలు వచ్చాయి.
దలేర్‌కు వ్యతిరేకంగా 31 కేసులు నమోదు కావటంతో గతంలో పాటియాలా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్ పై విడుదలైన దలేర్ ఇన్నేళ్లుగా విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా పాటియాలా కోర్ట్ దలేర్ మెహందీని దోషిగా తేల్చింది. ప్రస్తుతం దలేర్‌తో పాటు ఆయన సోదరుడు షంషేర్ సింగ్ పాటియాలా కోర్ట్ కస్టడీలో ఉన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







