సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వరూపం 2..

- March 16, 2018 , by Maagulf
సెన్సార్ పూర్తి చేసుకున్న విశ్వరూపం 2..

కమల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విశ్వరూపం 2. విశ్వరూపం చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్‌ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. కొన్నాళ్ళు అటకెక్కిన ఈ ప్రాజెక్ట్ ఈ మధ్య పోస్ట్ ప్రొడక్షన్స్, డబ్బింగ్ పనులు శరవేగంగా జరుపుకుంది. యూఎస్ లో ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తైనట్టు తెలుస్తుంది. జూన్ లో మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న విశ్వరూపం 2 చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు ఆండ్రియా, నాజర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. విశ్వరూపం చిత్రంలో అవినీతితో పాటు కొన్ని సంఘటనలకి సంబంధించిన సీన్స్ అభిమానులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించాయి. ఇండియాలోనే కాదు విదేశాలలోను విశ్వరూపం 2 మూవీపై భారీ ఆసక్తి నెలకొంది. త్వరలోనే చిత్ర ట్రైలర్ విడుదల చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com