నేల టిక్కెట్టు నంబర్ 420!!
- March 17, 2018
క్లాసు.. మాసు...ఆడియన్స్ ఎవరైనా రవితేజ సినిమాకు రెడీనే బాసూ! నేల, కుర్చీ, బెంచ్, బాల్కనీ ఇలా వరస పెట్టి టిక్కెట్లు తెగాల్సిందే. థియేటర్స్‌లో ఎంటర్‌టైన్మెంట్ డబుల్.. ట్రిపుల్ అవ్వాల్సిందే. రవితేజ హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న సినిమాకు ‘నేల టిక్కెట్టు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో మాళవిక శర్మ కథానాయిక. తెలుగువారి తొలి పండగ ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
ఉగాది పచ్చడిలోని షడ్రుచుల మాదిరి సినిమాలో ఆల్ ఎమోషన్స్ గ్యారంటీ. ఏడాది పిల్లల నుంచి అందరూ ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను చూసి ఫుల్‌గా ఎంటర్‌టైన్ అవుతారని చిత్రబృందం చెబుతోంది. కానీ ఫస్ట్ లుక్‌లో టిక్కెట్ ఖరీదు పది రూపాయాలు అని ఉంది. టిక్కెట్ నంబర్ ఏమో 420 అని ఉంది. మరి.. ఈ 420 బ్యాగ్రౌండ్ ఏంటో తెలియాలంటే ఆడియన్స్ థియేటర్స్‌కి వెళ్లాల్సిందే. ఆల్మోస్ట్ 60 శాతం చిత్రీకరణ పూరై్తంది. ఈ చిత్రాన్ని మే 24న రిలీజ్ చేయాలనుకుంటున్నారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!