20న జరగనున్న ఉగాది మీడియా పురస్కారాలు

- March 17, 2018 , by Maagulf
20న జరగనున్న ఉగాది మీడియా పురస్కారాలు

హైదరాబాద్: శృతిలయ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు ఆ సంస్థ కార్యదర్శి ఆమని తెలిపారు. 20న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో నిర్వహించనున్న పురస్కార ప్రదానోత్సవంలో సీనియర్ పాత్రికేయులు ఉడయవర్లు, డా.రౌనఖ్ యార్‌ఖాన్‌కు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. ప్రింట్‌మీడియా పాత్రికేయులు ఎస్.రామచంద్రాచార్య (నమస్తే తెలంగాణ)తో పాటు ఆర్.రవికాంత్‌రెడ్డి(హిందూ), బి.వాజేంద్ర(ఈనాడు), ఎస్.సత్యబాబు (సాక్షి) తదితరులను ఎంపిక చేశారు. ఎలక్రానిక్ మీడియా నుంచి వీ6 బుచ్చన్న, టీవీ9 మురళీకృష్ణ తదితరులకు పురస్కారాలు అందజేస్తారన్నారు. స్పీకర్ మధుసూదనాచారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com