ప్రియురాలి రూమ్ నుంచి దూకిన ప్రియుడు
- March 18, 2018
19 ఏళ్ళ ఇరానియన్ యువకుడు, తన ప్రియురాలి రూమ్ నుంచి కిందికి దూకి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. షార్జాలో నివసిస్తోన్న 15 ఏళ్ళ బాలిక ఇంటికి వెళ్ళిన ప్రియుడు, ఆమె తండ్రి రూమ్‌లోకి రావడంతో, రెండో అంతస్తులో వున్న ఆ రూమ్ నుంచి కిందికి దూకేశాడు. ఈ క్రమంలో అతనికి గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రసస్తుతం ఆ యువకుడు ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆసుపత్రి వర్గాలు అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్లు వెల్లడించాయి. తన ప్రియురాలి రూమ్‌లో తాను వున్నప్పుడే, ఆ రూమ్ డోర్‌ని ఆమె తండ్రి 'నాక్' చేయడంతో, భయపడి బాల్కనీలో దాక్కున్న ప్రియుడు, వాట్సాప్ ద్వారా ప్రియురాలితో ఆమె తండ్రి గురించి వాకబు చేశాడు. 30 నిమిషాల తర్వాత కూడా రూమ్‌లోంచి ప్రియురాలి తండ్రి బయటకు వెళ్ళకపోవడంతో, బాల్కనీలోకి కూడా వచ్చేసి, తనను నిలదీస్తాడన్న భయంతో యువకుడు కిందికి దూకినట్లుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో 'దిస్ ఈస్ యువర్ రోల్' ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..