'ఛల్ మోహన్‌రంగ' చిత్రం ఆల్బమ్ విడుదల
- March 19, 2018
నితిన్, మేఘాఆకాష్ నాయకానాయికలుగా నటిస్తున్న ఛల్ మోహన్‌రంగ చిత్రం ఆల్బమ్‌ని విడుదలచేశారు. కృష్ణచైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిఖితారెడ్డి సమర్పణలో పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్, శ్రేష్ట్ర మూవీస్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు కోవలోనే తాజాగా విడుదలైన మిగతా మూడు పాటలు విభిన్న శైలిలో ఉన్నాయి. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ, ఆల్బమ్‌లో ప్రతీ పాటను కొత్తగా రూపొందించడమే కాకుండా ప్రతీ పాటను హిట్ చేయగల అతి తక్కువమంది సంగీత దర్శకులలో తమన్ ఒకరు. మాస్ నుంచి క్లాస్ వరకు, ప్రేమ నుంచి విరహం వరకు, సంతోషం నుంచి బాధ వరకు..అన్నింటినీ ఎంతోబాగా స్వరపరిచి ఒక పూర్తిస్థాయి ఆల్బమ్ ఇచ్చారని చెప్పారు. యు.ఎస్., ఊటీ, హైదరాబాద్‌లలో ఎన్నో అందమైన ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరిపామని వివరించారు. నిర్మాత ఎన్.సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ, చిత్రాన్ని ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కె.వి.నరేష్, లిజి, రోహిణి హట్టంగడి, రావు రమేష్, సంజయ్ స్వరూప్, ప్రభాస్ శ్రీను, నర్రా శ్రీను, మధునందన్, ప్రగతి, సత్య, షమ్మి సాయి, రాజశ్రీ నాయర్, అశురెడ్డి, వెన్నెల రామారావు, కిరీటి, రణధీర్, నీలిమ భవాని, బాల తారలు హాసిని, కృతిక, జాయ్, లిఖిత్, స్నేహిత్, స్కందన్ తదితరులు తారాగణం. ఈ చిత్రానికి కెమెరా: ఎన్.నటరాజ సుబ్రమణియన్, కూర్పు: ఎస్.ఆర్.శేఖర్, నృత్యాలు: శేఖర్ వి.జె., పోరాటాలు: స్టంట్ సిల్వ, రవివర్మ.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







