మే 9కి ముస్తాబవుతున్న 'మహానటి'
- March 19, 2018
మూడు దశాబ్దాల పాటు దక్షిణాది సినీ ప్రియులను అలరించి, ప్రేక్షకుల గుండెల్లో మహానటిగా ముద్ర వేసుకున్న నటి సావిత్రి. మహానటి పేరుతో సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా ఓ సినిమా వస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.
దక్షిణాది సినీ అభిమానులను దశాబ్దాల పాటు తన నటనతో మెప్పించిన మహానటి సావిత్రి. ముఖ్యంగా తెలుగు వారి ఆరాధ్య నటిగా సావిత్రిది తరిగిని ఇమేజ్. తరాలు మారిన ఆ మహానటిని ఇంకా అభిమానిస్తూనే ఉన్నారు. అలాంటి సావిత్రి జీవిత కథతో యువ దర్శకుడు నాగ్ అన్వేష్ వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ నిర్మాతగా, మహానటి పేరుతో సినిమా రూపొందిస్తున్నారు. సావిత్రి బాల్యం నుంచి మరణం వరకు జరిగిన ముఖ్యం సంఘటనలను ఈ మహానటి మూవీలో చూపించబోతున్నారు. తెలుగు, తమిళంలోనే కాక ఇతర ఇండియన్ లాంగ్వేజెస్ లోనూ ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు.
మహానటి మూవీలో సావిత్రి పాత్రలో క్రేజీ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తోంది.. జెమినీ గణేశన్ పాత్రల్లో దుల్కల్ సాల్మన్ చేస్తున్నాడు. ముఖ్యంగా సావిత్ర లుక్ లో కీర్తు సురేష్ అతికినట్టు సరిపోయింది. కాస్ట్యూమ్స్, లుక్ అన్నింటికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అలాగే జెమినీ గణేశ్ లుక్ లో దుల్కర్ సాల్మన్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఇక ఈ మూవీలో అనుష్క భానుమతిగా, మోహన్ బాబు ఎస్.వి.ఆర్ గా, నాగచైతన్య ఎఎన్ఆర్ గా, సమంత జమునగా కనిపించబోతున్నారు. మార్చిలోనే విడుదలవ్వాల్సిన ఈ చిత్రం పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని మే 9న రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!