ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తాం: కేటీఆర్
- March 19, 2018
హైదరాబాద్ : నాగోల్, హైటెక్‌సిటీ, ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రోను విస్తరిస్తామని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మెట్రో పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. జేబీఎస్, ఎంజీబీఎస్ వద్ద మెట్రో పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. మెట్రో మార్గాల్లో రహదారుల విస్తరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కొన్ని చోట్ల రోడ్ల వెడల్పు 200 అడుగుల మేర విస్తరిస్తున్నామని తెలిపారు. సుల్తాన్ బజార్ ఏరియాలో 66 అగుడుల వరకు విస్తరిస్తున్నామని స్పష్టం చేశారు. పాత బస్తీలో ప్రాజెక్టు పనులను వందకు వంద శాతం పూర్తి చేస్తామన్నారు. జేబీఎస్ నుంచి ఫలక్‌నూమా వరకు మెట్రో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మెట్రో ప్రాజెక్టు మొత్తం కాస్ట్ రూ.14 వేల 133 కోట్లు, కాగా ఇప్పటి వరకు రూ. 2,296 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







