గ్రాండ్‌గా మోహన్‌బాబు బర్త్‌డే..
- March 19, 2018
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు బర్త్‌డే వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ స్కూల్‌లో రంగరంగ వైభవంగా పుట్టినరోజు జరుపుకున్నారు. విద్యానికేతన్ విద్యాసంస్థలు 26 ఏళ్లు పూర్తిచేసుకోవడంతోపాటు మోహన్‌బాబు పుట్టినరోజు కావడంతో కలర్‌ఫుల్‌గా ఈవెంట్ జరుపుకున్నారు. సినీతారలు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు.
తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్‌లో డైలాగ్‌కింగ్ మోహన్‌బాబు బర్త్‌డే వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. విద్యానికేతన్ విద్యాసంస్థలు కూడా 26 ఏళ్లు పూర్తిచేసుకోవడంతోపాటు మోహన్‌బాబు పుట్టినరోజు కూడా కావడంతో అతిరథ మహారథుల సమక్షంలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
శ్రీవిద్యానికేతన్ స్కూల్‌లో జరిగిన ఈవెంట్‌లో కల్చరల్ ప్రోగ్రామ్స్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాయి. రామకుప్పంకు చెందిన ప్రముఖ డప్పు కళాకారులు వాయించిన దరువుకు మంచు లక్ష్మీ, హీరోయిన్ ప్రజ్ఞాజైస్వాల్ మైమర్చిపోయారు. స్టేజ్‌పై స్టెప్పులేస్తు అందరిని ఉర్రూతలూగించారు.
శ్రీవిద్యానికేతన్ స్టూడెంట్స్ డ్యాన్స్ ఫెర్మామెన్స్‌తో ఆకట్టుకున్నారు. క్లాస్, మాస్, వెస్ట్రన్స్ సాంగ్స్‌కి స్టెప్పులేస్తూ అదరగొట్టారు. సత్తా ఎంటో నిరూపించారు.ఏది మంచో ఏది చెడ్డో ఇప్పటి జనరేషన్‌కు తెలుసని.. విద్యార్థులంతా మంచిని తీసుకుని విజయం సాధించాలని మోహన్‌బాబు ఆకాంక్షించారు. నమ్మకం విజయాన్ని సాధించడమే కాదు పతనానికి నాంది పలుకుతుందని కొన్ని ఉదహరణలు చెప్పారు.
వేదికపై తన తండ్రి మోహన్‌బాబుకు శుభాకాంక్షలు తెలిపిన మంచు మనోజ్..వచ్చే జన్మలో ఆయనకు కొడుగ్గా కాకుండా తమ్ముడిలా పుట్టాలని..ఎక్కవ సేవలు చేసుకుంటానని ప్రేమను చాటుకున్నారు. పిల్లలపై తల్లిదండ్రులు ఒత్తిడి తీసుకురాకుండా ఎంకరేజ్ చేయాలని మనోజ్ కోరారు.
సినీరాజకీయ ప్రముఖులతోపాటు విదేశాలకు చెందిన ప్రతినిధులు మోహన్‌బాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. మోహన్‌బాబుకు బర్త్ డే విషెస్ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!