అంత్యక్రియలకు హాజరయ్యేందుకు చిన్నమ్మకు పెరోల్ మంజూరు
- March 20, 2018
చెన్నై : తీవ్ర అనారోగ్యంతో మరణించిన తన భర్త నటరాజన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 15 రోజుల పెరోల్ కోసం ఏఐఏడీఎంకే బహిష్కృత చీఫ్ వీకే శశికళ మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు. నటరాజన్ ఈరోజు తెల్లవారుజూమున ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఛాతీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న నటరాజన్‌ను గతవారం గ్లెన్‌ఈగల్స్ గ్లోబల్ హెల్త్ సిటీ ఆస్పత్రికి తరలించారు. నటరాజన్‌కు 2017లో లివర్, కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగాయి.
కాగా ప్రస్తుతం బెంగళూర్‌లోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళ భర్త అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నేరుగా తంజావూర్ వెళ్లనున్నట్టు తెలిసింది. బ్రిటన్ నుంచి దిగుమతి సుంకం చెల్లించకుండా లగ్జరీ కారును కొనుగోలు చేశారనే కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో నటరాజన్ సీబీఐ కోర్టు ఎదుట లొంగిపోయారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







