మహిళను వేధింపులకు గురిచేసిన సేల్స్‌మెన్‌

- March 20, 2018 , by Maagulf
మహిళను వేధింపులకు గురిచేసిన సేల్స్‌మెన్‌

దుబాయ్‌లోని ఓ షాప్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి, అక్కడికి కొనుగోలు కోసం వచ్చిన ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ప్రాసిక్యూషన్‌ వివరాల ప్రకారం, 22 ఏళ్ళ ఆఫ్గాన్‌ వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాధితురాలు 31 ఏళ్ళ ఫ్రెంచ్‌ మహిళ. డిస్‌ప్లేలో వుంచిన గూడ్స్‌ని తాను పరిశీలిస్తుండగా, సేల్స్‌మేన్‌ తనను అసభ్యకరంగా తాకడమే కాకుండా, గట్టిగా పట్టుకున్నాడనీ, దాంతో అతనిపై తాను తిరగబడి, దూరంగా జరిగాననీ పేర్కొన్నారామె. పోలీసులకు బాధితురాలు ఫోన్‌ చేయగా, అక్కడికి వచ్చిన పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ఆమెను తాను తాకినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు. చిన్న పొరపాటుకి తాను క్షమాపణ కూడా చెప్పానని అంటున్నాడు నిందితుడు. అయితే పోలీసులు అరెస్ట్‌ చేసిన నిందితుడ్ని, ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. షాప్‌లో సీసీటీవీ ఫుటేజ్‌ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు విచారణ ఏప్రిల్‌ 5న జరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com