'ఎమ్మెల్యే' తో ఫేస్ బుక్ లైవ్ @3PM
- March 20, 2018
నందమూరి హీరో కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన సినిమా ఎమ్మెల్యే - 'మంచి లక్షణాలున్న అబ్బాయి'. ఈ మూవీ ఈ నెల 23వ తేదిన విడుదలై ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఫేస్ బుక్ లో తన అభిమానులతో హీరో కళ్యాణ్ రామ్ లైవ్ ఛాట్ చేయనున్నారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తారు.
ఎమ్మెల్యే మూవీ ప్రీ రిలీజ్ వేడుక..
నందమూరి హీరో కళ్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన సినిమా 'ఎమ్మెల్యే'. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలు మంగళవారం రాత్రి 7 గంటలకు అట్టహాసంగా జరిగాయి. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ పొలిటీషియన్ గా కనిపించనున్నారు. టి.జి.విశ్వప్రసాద్ సమర్పణలో బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై నూతన దర్శకుడు ఉపేంద్ర మాధవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భరత్ చౌదరి, కిరణ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, కాజల్‌తో పాటు రవి కిషన్, పోసాని, జయప్రకాశ్ రెడ్డి, అజయ్, వెన్నెల కిశోర్, పృథ్వి, శివాజీ రాజా, ప్రభాస్ శ్రీను, లాస్యా, మనాలి రాథోడ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







