'మన్‌మర్జాయన్' చిత్రంలో అభిషేక్ లుక్
- March 20, 2018బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న అభిషేక్ బచ్చన్ రెండేళ్ళు వెండితెరకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే . కెరీర్‌లో అడపాదడపా పలు హిట్స్ కొట్టిన అభిషేక్‌ని ఎక్కువగా ఫ్లాపులే పలకరించాయి. దీంతో కొన్నాళ్ళ పాటు సినిమాలకి దూరంగా ఉండి బిజినెస్‌లపై దృష్టి పెట్టాడు. రెండేళ్ళ తర్వాత మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు అభిషేక్. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో అభిషేక్ చేస్తున్న తాజా ప్రాజెక్ట్ పేరు 'మన్‌మర్జాయన్' . ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్కీ కౌశాల్, తాప్సీ పన్ను ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తొలిసారి అభిషేక్‌తో కలిసి తాప్సీ ఈ చిత్రంలో నటిస్తుంది. తాజాగా అభిషేక్ చిత్రంలో తమ పాత్రలకి సంబంధించిన లుక్స్ రివీల్ చేశారు. పంజాబీ వ్యక్తిగా అభిషేక్ కనిపిస్తుంటే, తాప్సీ, విక్కీలు కూల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తాజా వార్తలు
- IELTS కు బహ్రెయిన్ విద్యార్థులు ఆసక్తి..!
- రియాద్‌లో మొదటి ఈయూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభం
- మోటార్‌సైకిల్‌కు నిప్పంటించిన ముగ్గురు అరెస్టు
- 2024 చివరి నాటికి యూనిఫైడ్ GCC టూరిస్ట్ వీసా
- యూఏఈలో ICSE, ISC ఫలితాలు విడుదల
- హట్టా పర్వతాల నుండి బ్రిటిష్ హైకర్ ఎయిర్ లిఫ్ట్
- అహ్మదీ గవర్నర్‌ను కలిసిన భారత రాయబారి
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్‌కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…