బ్రెజిల్లో భారీ వరదలు..
- March 20, 2018
బ్రెజిల్లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా బెలో హారిజోంటీలో జనజీవనం స్తంభించిపోయింది. లోతైన ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వరద నీటికి వాహనాలు, కార్లు కొట్టుకుపోయాయి. గత శుక్రవారం కేవలం 20 నిమిషాల్లోనే 49 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు నమోదైంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నట్లు స్థానిక మీడియా సమాచారం. ఈ వరదల్లో ఇంతవరకూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







