రస్ అల్ ఖైమాలో విధించిన జరిమానాలపై 30 శాతం డిస్కౌంట్
- March 21, 2018
రస్ అల్ ఖైమా : విధించిన జరిమానాలపై మార్చి 20 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు చెల్లుబాటు అయ్యే విధంగా 30 శాతం డిస్కౌంట్ ను రస్ అల్ ఖైమా పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ మూడు రోజుల డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సదుపాయం వరల్డ్ హ్యాపీనెస్ డే సందర్భంగా ఉద్దేశించబడింది. డైరెక్టర్ జనరల్ డిపార్ట్మెంట్ ఇంజినీర్ అహ్మద్ మొహమ్మద్ అహ్మద్ అల్ హమ్మాడి తెలిపిన వివరాల ప్రకారం."పర్యావరణ వ్యతిరేక ఉల్లంఘనలకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రజలకు తెలియచేస్తూ , పర్యావరణానికి సంబంధించి ఏ ఉల్లంఘనను నివేదించామని, ఉద్యోగులందరూ తమ తమ సంతోషాన్ని పంచుకునేందుకు వారికి వివిధ బహుమతులు పంపిణీ చేశారు. "స్ఫూర్తిదాయకమైన పని వాతావరణానికి ప్రధాన లక్షణాలలో సంతోషం అనేది ఒకటి. "సంతోషంగా ఉన్న ఉద్యోగి బంధనాల నుండి వెలుపలకు వచ్చి ఆలోచించగలడు అలాగే ,వినియోగదారులకు ఆనందం కలిగించగలడు." అదేవిధంగా రాస్ అల్ ఖైమా లో ప్రతి ఇంటికి మొక్కను సమర్పించటానికి ఒక నూతన కార్యక్రమం ప్రారంభించబడింది. " వరల్డ్ హ్యాపీనెస్ డే మరియు జాయేద్ ఇయర్, ఎమిరేట్ లో పచ్చని ప్రాంతాలు వ్యాపించడానికి ఎంతో సహాయం పడుతుంది. ప్రజలకు సంతోషం పంచడమే కాక వారిని పర్యావరణ రక్షణలో భాగస్వామిగా ఉండేందుకు తాము ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







