పంచ్ లతో అదరగొట్టేసిన హాస్య బ్రహ్మ
- March 21, 2018
బుల్లితెర పై ఎంతోమంది యాంకర్లు హడావిడి చేస్తూ ఉన్నా యాంకర్ సుమ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గదు. దీనితో ఫిలిం ఇండస్ట్రీలో జరిగే చాల పెద్ద ఫంక్షన్స్ సుమ లేకుండా జరగలేని పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో నిన్న జరిగిన 'ఎం.ఎల్.ఎ' ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం సుమను టార్గెట్ చేస్తూ వేసిన సెటైర్ ఆ కార్యక్రమానికి హైలెట్ గా మారింది.
ఈ ఫంక్షన్ వేదిక పైకి రాగానే బ్రహ్మానందం తన కామెడీ పంచ్ లతో రెచ్చిపోయాడు. వేదిక ఎక్కీఎక్కగానే సుమ మీద పేలిపోయే పంచ్ విసిరాడు. ''నా చిన్నప్పట్నుంచి చూస్తున్నా సుమ ఇప్పటికీ అలాగే ఉంది'' అని బ్రహ్మి అనడంతో సుమ చేతులెత్తి దండం పెట్టేసింది. ఆ తర్వాత బ్రహ్మీ మణిశర్మ గురించి మాట్లాడుతూ ''ఆయన గురించి మాట్లాడేంత వయసు తనకు లేదని' అంటూ మరోసారి జోక్ చేసాడు.
ఇదే సందర్భంలో రామజోగయ్య శాస్త్రి గురించి మాట్లాడుతూ ''ఆయన తెలివి తేటలతో కాదు తెలుగు తేటలతో కవిత్వం రాస్తారు'' అంటూ తనకు భాష పై ఉన్న పట్టును ప్రదర్శించాడు. ఈ సందర్భంలో బ్రహ్మానందం నటుడు ఎమ్మెస్ నారాయణను గుర్తు చేసుకుంటూ తాను ఏదైనా గెటప్ వేసుకుని ఎలా ఉందిరా అని అడిగితే తనవైపు చూడకుండానే బాగుంది అనేవాడని అంటూ మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు.
అయితే తాను చూడకుండానే ఎలా చెపుతున్నావు అంటూ ఎమ్.ఎస్. ను అడిగినప్పుడు తాను చూసినా కూడా అలాగే అనాలి కదా అని తన పై ఎమ్.ఎస్. నారాయణ జోక్ చేసేవాడని అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు బ్రహ్మానందం. దీనితో నిన్నటి 'ఎం.ఎల్.ఎ.' ఫంక్షన్ అంతా బ్రహ్మానందం పంచ్ లతో అందరికీ ఆనందాన్ని పంచింది. ఇప్పటికే ఈమూవీకి మంచి బిజినెస్ జరిగిన నేపధ్యంలో ఇంత బిజినెస్ జరిగిన ఈ చిత్రం సేఫ్ అవ్వాలంటే చాలా మంచి టాక్ అవసరం. మరి పబ్లిక్ రెస్పాన్స్ ఎలాగుంటుందనేది ఈ శుక్రు వారం తేలిపోతుంది..
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







