మసీదుల్లో నక్కి కాల్పులు జరిపిన ఉగ్రవాదులు
- March 21, 2018
జమ్మూ కాశ్మీర్లో కుప్వారా జిల్లా కాల్పుల మోతతో దద్దరిల్లింది. రెండు రోజులుగా జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఐదుగురు ఉగ్రవాదులను మన సైన్యం అంతం చేసింది. హల్మాత్పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు బీఎస్ఎఫ్, సైన్యం కళ్లుగప్పి నియంత్రణ రేఖను దాటారు. షంసాబారి పర్వత శ్రేణులు దాటి 8 కిలోమీటర్లు ముందుకొచ్చారు. అప్పటికే అక్కడున్న మరికొందరు ఉగ్రవాదులతో కలిసి కుప్వారా పట్టణంవైపు వస్తుండగా మంగళవారం ఉదయం స్థానిక పోలీసులు గమనించారు. పోలీసులను చూసి ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, సైన్యం, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా వారిపై ఎదురుదాడికి దిగారు.
మంగళవారం ఉదయం మొదలైన భీకర ఎన్కౌంటర్ సుమారు 48 గంటల పాటు కొనసాగింది. ఉగ్రవాదులు స్థానిక మసీదుల్లో నక్కి భద్రతా దళాలపై కాల్పులు జరిపారు. భద్రతా దళాలు మంగళవారమే నలుగురు ముష్కరులను మట్టుబెట్టాయి. ఐదో ఉగ్రవాదిని బుధవారం హతమార్చాయి. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా మరణించారు. వీరిలో ఇద్దరు పోలీసులు, ముగ్గురు జవాన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓ సైనికుడు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..