న్యూ ఎయిర్ పోర్ట్‌లో పార్కింగ్ ఛార్జీల పెంపు
- March 21, 2018
మస్కట్ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్కింగ్ ధరల్ని ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ విభాగం పెంచింది. తొలి అర్థ గంటకు 500 బైజాస్ చెల్లించాల్సి వుండగా, గంటకు 2 ఒమన్ రియాల్స్ చెల్లించాలి. ఓల్డ్ ఎయిర్ పోర్ట్‌లో పార్కింగ్ రుసుము తొలి గంటకు 500 బైజాస్ కాగా, ప్రతి 30 నిమిషాలకు మరో 500 బైజాస్ చెల్ల్లించాల్సి వచ్చేది. లాంగ్ టెర్మ పార్కింగ్ రుసుము కూడా రెండింతలకు పైగానే జరిగింది. తొలి రోజుకి 7 ఒమన్ రియాల్స్, రెండో రోజుకి 13 ఒమన్ రియాల్స్, మూడో రోజుకి 20 రియాల్స్ చెల్లించాలి. మూడో రోజు తర్వాత ప్రతి రోజుక 5 ఒమన్ రియాల్స్ చెల్లింపు తప్పనిసరి. గతంలో లాంగ్ టెర్మ్ పార్కిగ్ కోసం 3 ఒమన్ రియాల్స్ (ఒక రోజు), 4 ఒమన్ రియాల్స్ (రెండో రోజుకి), మూడో రోజుకి 5 ఒమన్ రియాల్స్, నాలుగో రోజుకి 6 ఒమన్ రియాల్స్, ఐదో రోజు తర్వాత 7 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సి వచ్చేది. కాగా, కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం 8000 కార్లకు పార్కింగ్ అకామడేట్ చేయగలదు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..