'టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ రీడర్స్' లో మోదీ టాప్-10
- December 01, 2015బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఓటమి ప్రధాని నరేంద్ర మోదీని నిరాశపరిచినా అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఆయన హవా కొనసాగుతోంది. 'టైమ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ రీడర్స్' చాయిస్ పోల్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం టాప్-10లో నిలిచారు. సోమవారం సాయంత్రానికి మోదీ 2.7 శాతం ఓట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. భారత్ లో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించడం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని ఆధునీకరించేందుకు మోదీ ప్రయత్నించడం వంటి అంశాలను టైమ్ ప్రొఫైల్ లో పేర్కొంది. టాప్-10లో మోదీతో పాటు పాకిస్తాన్ ధీర బాలిక, నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్, పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారు. ఈ పోల్ లో అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న డెమొక్రటిక్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ (10.5 శాతం) అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. శాండర్స్ కు తన పోటీదారులు డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్-2.1 శాతం), హిల్లరీ క్లింటన్ (డెమొక్రటిక్-1.4 శాతం)ల కంటే ఎక్కువ మద్దతు లభించింది. ఇక మలాలా (5.9 శాతం), పోప్ ఫ్రాన్సిస్ (3.9 శాతం) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నాలుగు, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ పది స్థానాల్లో ఉన్నారు. ఇక భారత సంతతికి చెందిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ 1.5 శాతం ఓట్లతో 25వ స్థానంలో నిలిచారు. చాయిస్ పోల్ ఓటింగ్ ఈ నెల 4వ తేదీతో ముగియనుంది. విజేతను 7న ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







