రికార్డులు సృష్టిస్తున్న మహేష్ బాబు
- March 23, 2018
తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా 'రాజకుమారుడు' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తర్వాత మురారి చిత్రంతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు లవర్ బాయ్ లా ఉన్న మహేష్ బాబు 'పోకిరి' చిత్రంతో మాస్ హీరోగా ఒక్కసారే టాప్ లెవెల్లోకి వెళ్లాడు. వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న మహేష్ బాబు 'శ్రీమంతుడు' లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంతో ఘన విజయం సాధించాడు. ఆ తర్వాత రిలీజ్ అయిన 'బ్రహోత్సవం', 'స్పైడర్' బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి.
అయితే మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' చిత్రంలో నటిస్తున్నాడు మహేష్. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతుంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డు చేరింది.బాలీవుడ్ భామ కైరా అడ్వాణీ ఈ మూవీ లో మహేష్ కు జోడిగా నటిస్తుంది.టాలీవుడ్లోనే అత్యధిక లైక్స్ సాధించిన టీజర్‌గా రికార్డు నెలకొల్పగా , తాజాగా మరో రికార్డు సాధించింది.
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది లైక్ చేసిన టీజర్లలో రెండో స్థానంలో ఈ టీజర్ నిలిచింది. ఇప్పటివరకూ ఈ చిత్ర టీజర్‌ను 6,40,000 మంది లైక్ చేశారు. ఈ సందర్భంగా 'BAN 2nd most liked teaser in world' హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!