ఎవెన్యూస్ మాల్ 4 వ దశ ప్రారంభంకు హాజరవనున్న ప్రధాన మంత్రి

- March 23, 2018 , by Maagulf
ఎవెన్యూస్ మాల్ 4 వ దశ ప్రారంభంకు  హాజరవనున్న ప్రధాన మంత్రి

కువైట్: ప్రధాన మంత్రి శ్రీ షేక్ జబెర్ అల్ ముబారక్ అల్-హమాద్ అల్ సబహ్ గురువారం అవెన్యూస్ మాల్ లో నాలుగో దశ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఖలీద్ అల్ జర్ర అల్ సబా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు క్యాబినెట్ వ్యవహారాల సహాయ మంత్రి అనాస్ అల్ సలీ, అమిరి దివాన్ వ్యవహారాల ప్రతినిధి షేక్ మహ్మద్ అల్-అబ్దుల్లా అల్ ముబారక్ అల్ సబాహ్, షేక్ లు, మంత్రులు, సీనియర్ రాష్ట్ర అధికారులు. హాజరయినట్లు  ఒక పత్రిక  ప్రకటనలో పేర్కొన్నారు.గౌరవనీయ ప్రధానమంత్రి  షేక్ జబెర్ అల్ ముబారక్ అవెన్యూస్లో నూతన అభివృద్ధిని ప్రశంసించారు, స్థానిక మరియు అంతర్జాతీయంగా ఈ ప్రాజెక్ట్  కువైట్ కు ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. దేశం యొక్క అభివృద్ధి ప్రణాళిక పెంచడంతో పాటు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రైవేటు రంగం అమలు చేసే ఈ తరహా ప్రాజెక్టుల ప్రాముఖ్యతను ఆయన ఈ సందర్భంగా వివరించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com