శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు కేసీఆర్‌ శంకుస్థాపన

- March 23, 2018 , by Maagulf
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులకు కేసీఆర్‌ శంకుస్థాపన

శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సీఎం కేసీఆర్‌ జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ స్థాయిలో విస్తరించే పనులకు కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. అదే విధంగా దేశంలో అతిపెద్ద కన్వెక్షన్‌ సెంటర్‌కు శిలాఫలకం ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్‌, గ్రీన్‌ఫీల్డ్‌ సిటీని కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్‌ ఛైర్మన్‌ గ్రంథి మల్లికార్జునరావు, మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రముఖులు పాల్గొన్నారు.

2008లో ప్రారంభమైన శంషాబాద్‌ విమానాశ్రమం క్రమక్రమంగా విస్తరిస్తూ వస్తోంది. పదేళ్లుగా నిరాంటకంగా ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఏటా లక్షల మందిని విదేశాలకు చేరుస్తూ.. భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేసింది. అత్యుత్తమ సేవలకుగాను ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. దశాబ్ది వేడుకల్లో డెకెడ్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ స్టాంప్‌తో పాటు ఎన్వలప్‌ని విడుదల చేశారు. జీఎంఆర్‌ వరలక్ష్మీ ఫౌండేషన్‌ నిర్వహించే శిక్షణ కార్యక్రమాల కోసం ప్రభుత్వంతో మూడు ఎంవోయూలపై సంతకాలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com