విమానంలో సీటు కింద 1.222 కేజీల బంగారం
- March 23, 2018
శంషాబాద్:విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న 1.222 కేజీల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న ఘటన శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకొంది. సదరు బంగారం సామగ్రిలో కాకుండా విమానంలోని నిందితుడి సీటు కింద లభ్యమైంది. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొన్నారు.విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఎయిర్ ఇండియా విమానంలో దుబాయ్ నుంచి శంషాబాద్‌కు వచ్చాడు. ఎయిర్‌పోర్టు బయటకు వస్తున్న క్రమంలో సదరు ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన అధికారులు అతన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పాస్‌పోర్టును పరిశీలించారు. అదుపులోకి తీసుకొని తమదైన రీతిలో విచారించగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు అంగీకరించాడు. విమానంలో సీటు కింద రహస్యంగా పెట్టిన 1.222కేజీల బంగారం బిస్కెట్లను మరోవ్యక్తి అదే విమానంలో అదే సీటును బుకింగ్ చేసుకొని దిల్లీ మీదుగా వైజాగ్‌కు తరలిస్తాడని వివరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!