రామ్ తో జోడీ కట్టనున్న రాశీఖన్నా
- May 05, 2015
రామ్ హీరోగా 'శివం' అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీనివాస రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని స్రవంతీ మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా నేహాశర్మ చెల్లెలు అయిషాను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం రామ్ సరసన హీరోయిన్‌గా రాశిఖన్నాను ఎంపిక చేసినట్లుగా తెలిసింది. రాశిఖన్నా కూడా ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా వివరాలు ప్రకటించనున్నారు. ఈ అమ్మడు నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా మంచి విజయం సాధించి గోల్డెన్ లెగ్ అనిపించుకుంటోంది. ప్రస్తుతం రామ్ నటించిన 'పండగ చేస్కో' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం విడుదల అయిన వెంటనే 'శివం' రూపొందనుంది.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









