దుమ్మురేపుతున్న 'భరత్ అనే నేను' ఫస్ట్ సాంగ్

- March 24, 2018 , by Maagulf
దుమ్మురేపుతున్న 'భరత్ అనే నేను' ఫస్ట్ సాంగ్

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాటను ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఇప్పటికే రిపబ్లిక్ డే సందర్భంగా ఫస్ట్ ఓథ్ పేరుతో ఓ వీడియోని విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలు పెంచిన మేకర్స్ ఇటీవల టీజర్ విడుదల చేశారు. దీనికి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు దేవి శ్రీ సమకూర్చిన తొలి బాణీ విడుదలైంది. ఈ సాంగ్ మహేష్ ఫ్యాన్స్‌ని అలరిస్తోంది. టైటిల్ తోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా పోస్టర్స్ తోనూ మరింత ఆసక్తిని కలిగిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com