ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతా నిశ్చితార్థ వేడుక
- March 25, 2018
ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడి నిశ్చితార్థం శనివారం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను ముకేశ్ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ త్వరలో వివాహం చేసుకోనున్నాడు. ఈ ఏడాది ఆఖర్లో వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. రిలయన్స్ జియో కంపెనీ బోర్డులో ఆకాశ్ అంబానీ(25) డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోజీ బ్లూ ఫౌండేషన్‌లో శ్లోకా మెహతా డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకొనే సమయంలోనే ఆకాశ్, శ్లోకా ఒకరినొకరు ఇష్టపడ్డారని, 12వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తి కాగానే ఆకాశ్ లవ్ ప్రపోజల్‌ను శ్లోకా అంగీకరించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







