ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించిన టాలీవుడ్
- March 25, 2018
హైదరాబాద్ : ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు సాధనకు తెలుగు నటీనటుల సంఘం (మా) మద్దతు ప్రకటించింది. ఆదివారం సంఘం సభ్యులను ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కలిశారు. ప్రత్యేక హోదాపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా మా అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ.. ప్రత్యక హోదా, విభజన చట్టంలోని హామీల సాధనకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. వాటి అమలుకు తదుపరి కార్యాచరణ చెబుతామని చెప్పారు. సమావేశంలో పలువురు సినీ నటులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







